Wed Jan 21 2026 05:43:04 GMT+0000 (Coordinated Universal Time)
షర్మిల సీఎం కావడం ఖాయం
మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ ను వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

మాజీ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ను వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న డిఎస్ ను ఆయన ఇంటికి వెళ్లిన షర్మిల పలకరించారు. ఆయన త్వరగా కోలుకోవాలని షర్మిల ఆకాంక్షించారు. ఈ సందర్బంగా తనకు వైఎస్ తో ఉన్న పాత అనుబంధాన్ని షర్మిలతో గుర్తు చేస్తుకోనున్నారు. వైఎస్ ను కూడా ముఖ్యమంత్రి అవుతావని 2003లోనే తాను చెప్పానన్నారు.
ఐరన్ లేడీ....
షర్మిల ఐరన్ లేడీ అని, ఆమె కూడా ముఖ్యమంత్రి అవుతుందని డీఎస్ తెలిపారు. ఇది తన అనుభవంతో చెబుతున్న మాట అని డీఎస్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తెలంగాణలో వైఎస్ పై అభిమానం చెక్కు చెదరకుండా ఉందని అన్నారు. ప్రజల నుంచి స్పందన కూడా సరైన సమయంలో లభిస్తుందని తెలిపారు. వైఎస్సార్ బిడ్డ తప్పకుండా ముఖ్యమంత్రి అవుతుందని డీఎస్ వ్యాఖ్యానించారు.
Next Story

