Sun Dec 07 2025 23:18:21 GMT+0000 (Coordinated Universal Time)
జుక్కల్ నియోజకవర్గంలో షర్మిల పర్యటన
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు జుక్కల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు జుక్కల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆమె జుక్కల్ నియోజకవర్గం బండరంజాల్, గుండెనెమలి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఎనిమిదేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే దొర గడి నుంచి బయటకు వస్తారని, లేకుంటే ఫాం హౌస్ కే పరిమితమవుతారని షర్మిల విమర్శించారు. ఇప్పుడు మునుగోడు ఎన్నికలు రావడంతోనే కేసీఆర్ బయటకు వచ్చారని అన్నారు.
కేసీఆర్ పై ఫైర్....
ఓట్లు దండుకున్న తర్వాత తిరిగా ఫాం హౌస్ కు చేరుకోవడం కేసీఆర్ కు రివాజుగా మారిందన్నారు. ప్రజలు ఎలా బతుకుతున్నారన్నది కేసీఆర్ కు పట్టదని, ధరలను మూడింతలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆమె ఫైర్ అయ్యారు. తెలంగాణలో ఉద్ధరించింది చాలదన్నట్లు ఇప్పుడు దేశం మీద పడ్డారని షర్మిల మండి పడ్డారు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లను ప్రజలు తరిమికొట్టాలని వైఎస్ షర్మిల పిలుపు నిచ్చారు.
Next Story

