Fri Mar 20 2026 13:54:01 GMT+0530 (India Standard Time)
ఇంట్లోనే దీక్షకు దిగిన షర్మిల
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల లోటస్ పాండ్ లో నిరాహార దీక్ష చేస్తున్నారు.

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల లోటస్ పాండ్ లో నిరాహార దీక్ష చేస్తున్నారు. రోడ్డుమీద ఉన్న వైఎస్ షర్మిలను పోలీసులు బలవంతంగా ఇంటిలోపలకి తరలించారు. ఆ ప్రాంతంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. తాను ఇంట్లోనే దీక్ష కొనసాగిస్తానని వైఎస్ షర్మిల తెలిపారు. అరెస్టయిన తన పార్టీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలంటూ ఆమె దీక్షకు దిగారు. తన పాదయాత్రకు ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదని ఆమె ప్రశ్నిస్తున్నారు.
కార్యకర్తలను విడుదల చేసేవరకూ...
తమ పార్టీ కార్యకర్తలను విడుదల చేసే వరకూ తాను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనని వైఎస్ షర్మిల అన్నారు. మహిళ నేతలను కూడా ఆరుగంటలకు పైగానే పోలీస్ స్టేషన్ లో ఉంచడం ఏ చట్టంలో ఉందని ఆమె ప్రశ్నించారు. పోలీసులు బీఆర్ఎస్ నేతల ఏజెంట్లలా మారారని ఆమె ఆరోపించారు. ఇక్కడే ఆమరణ దీక్షను కొనసాగిస్తానని ఆమె పోలీసులనుహెచ్చరించారు. తన పాదయాత్రకు వెంటనే అనుమతి ఇవ్వాలని కూడా ఆమె డిమాండ్ చేశారు.
Next Story

