Fri Mar 20 2026 07:47:08 GMT+0530 (India Standard Time)
వైఎస్స్ షర్మిలకు అస్వస్థత
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్స్ షర్మిల అస్వస్థతకు గురయ్యారు. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తుండగా ఆమె సొమ్మసిల్లి పడిపోయారు

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్స్ షర్మిల అస్వస్థతకు గురయ్యారు. ఖమ్మం జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటిస్తుండగా ఆమె సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో వెంటనే ఆమెకు చికిత్స అందిస్తున్నారు. గత రెండు రోజులుగా ఎండలకు తిరుగుతుండటంతో వడ దెబ్బ తగిలిందని చెబుతున్నారు.
వడదెబ్బ....
ఇటీవల కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు వరంగల్, ఖమ్మం జిల్లాలో షర్మిల పర్యటిస్తున్నారు. ఈరోజు ఖమ్మం జిల్లాలో నష్టం జరిగిన పరిశీలిస్తుండగా వడదెబ్బకు వైఎస్ షర్మిల సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
Next Story

