Fri Mar 20 2026 23:54:16 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ పై వైఎస్ షర్మిల ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జార్ఖండ్ పర్యటనపై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జార్ఖండ్ పర్యటనపై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. జార్ఖండ్ కు వెళ్లి అక్కడ అమరులైన జవాన్ల కుటుంబాలకు పరిహారం అందించడం సరికాదని చెప్పారు. ఢిల్లీలో చనిపోయిన రైతులకు పరిహారం అందించడంలో తప్పులేదన్నారు. మరి మన రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల మాటేమిటి అని షర్మిల నిలదీశారు.
ఇక్కడ అమరులైన వారికి...
తెలంగాణలో రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించక అనేక మంది మరణించారని, అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అనేక మంది అమరులయ్యారని చెప్పారు. మరి వారి కుటుంబాలకు కేసీఆర్ ఎందుకు సాయం చేయరని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. 1200 మంది అమరులని ఉద్యమంలో గొంతు చించుకున్న కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కొందరే అమరులు ఎందుకు అయ్యారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
- Tags
- ys sharmila
- kcr
Next Story

