Wed Mar 18 2026 17:13:10 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ మోసం చేయని వర్గం ఏదీ?
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ఎన్నికలు వచ్చినప్పుడే బయటకు వస్తారన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఎల్లికల్ గ్రామంలో ఆమె పాదయాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది కాబట్టే కేసీఆర్ బయటకు వచ్చారని, లేకుంటే ఫాంహౌస్ లోనే ఉండేవారని వైఎస్ షర్మిల అన్నారు. కేసీఆర్ ఎన్నికల సమయంలోనే పథకాలను బయటకు తీస్తారని చెప్పారు.
ఎనిమిదేళ్లుగా...
ఎనిమిదేళ్లుగా కేసీఆర్ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ మోసం చేయని వర్గం, కుటుంబం అంటూ ఏమీ లేదని ఆమె మండి పడ్డారు. కేసీఆర్ మాట మీద నిలబడే నేత కాదన్నారు. మోసపూరితమైన పరిపాలన చేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. మాట మీద నిలబడే నాయకత్వం కోసమే తాను పార్టీ పెట్టానని ఆమె తెలిపారు. తన తండ్రి వైఎస్ రూపొందించిన ప్రతి పథకాన్ని అధికారంలోకి వస్తే అమలు చేస్తానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
Next Story

