Thu Sep 12 2024 13:09:51 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్కు షర్మిల ఫోన్
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఫోన్ చేశారు
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఫోన్ చేశారు. ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమవ్వాలని షర్మిల ఇద్దరినీ కోరారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీతో పాటు అధికార పార్టీ విపక్షాలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా భారీ ర్యాలీ చేయాలని, అందుకు అన్ని పార్టీలు కలసి చేస్తే బాగుంటుందని సూచించారు. పార్టీలకతీతంగా అందరూ వస్తే ప్రభుత్వం దిగి వస్తుందని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
బండికి కూడా....
అయితే బండి సంజయ్ దీనిపై మాట్లాడేందుకు త్వరలో కలుద్దామని చెప్పారు. పార్టీ నేతలతో ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నిరుద్యోగ సమస్యపై ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమని, ప్రగతి భవన్ మార్చ్ కు పిలుపునివ్వాలని షర్మిల కోరారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా తాను ఈ విషయంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Next Story