Thu Dec 18 2025 17:55:25 GMT+0000 (Coordinated Universal Time)
30లోగా విలీనం.. లేకుంటే?
వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల తన పార్టీ విలీనంపై ప్రకటన చేశారు

వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల తన పార్టీ విలీనంపై ప్రకటన చేశారు. ఈ నెల 30వ తేదీ లోపు విలీనంపై నిర్ణయం తీసుకుంటామని, లేకుంటే మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. వైఎస్సార్టీపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో షర్మిల ఈ కామెంట్స్ చేశారు. ఈ సమావేశానికి తెలంగాణలోని 33 జిల్లాల నుంచి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
119 నియోజకవర్గాల్లో...
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ 30వ తేదీలోపు కాంగ్రెస్ లో విలీనం జరగకుంటే సొంతంగానే బరిలోకి దిగనున్నామని ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో 119 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు వైఎస్సార్టీపీ సిద్ధంగా ఉందని ఆమె తెిపారు. అక్టోబరు రెండో వారం నుంచి ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణను రూపొందించుకుంటామని చెప్పారు. పార్టీ కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కష్టపడే ప్రతి ఒక్కరికీ పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని షర్మిల హామీ ఇచ్చారు.
Next Story

