Mon Dec 08 2025 13:26:13 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ పై షర్మిల ఫైర్
వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుంది

వైఎస్సార్టీపీ చీఫ్ వైెఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుంది. మరోసారి యువతను మోసగించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని షర్మిల ఆరోపించారు. 1.90 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, కేవలం ఎనభై వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం మోసం కాదా అని షర్మిల ప్రశ్నించారు. ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాల పరిస్థిితి ఏంటని షర్మిల నిలదీశారు.
వచ్చే ఎన్నికలలో.....
ఉన్నత చదవులు చదివిన యువత ఏడేళ్లుగా ఉద్యోగాలు రాక కులవృత్తులకు పరిమితమవుతున్నారని వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. పాదయాత్రలో ప్రతి సమస్య ను ఆకళింపు చేసుకుంటున్నానని చెప్పారు. కేసీఆర్ కు ప్రజా సమస్యలేవీ పట్టడం లేదని, ఈసారి ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని షర్మిల అభిప్రాయపడ్డారు.
Next Story

