Mon Dec 08 2025 16:47:05 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు అంశంలో టీఆర్ఎస్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరును షర్మిల ఎండగట్టారు. ఎప్పుడూ రాజకీయాలు చేయడమే కేసీఆర్ కు అలవాటుగా మారిపోయిందని, రైతుల ఆత్మహత్యలు, చావులు పట్టడం లేదని షర్మిల ఫైర్ అయ్యారు. పండిన పంట కళ్లముందే వర్షానికి కొట్టుకుపోతుంటే రైతులు ఆవేదనను కేసీఆర్ మాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.
పంటను కొనుగోలు చేయాలని....
తెలంగాణలో పండిన పంటలను ముందు ప్రభుత్వం కొనుగోలు చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. చివరి గింజవరకూ కొంటానని చెప్పిన కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారన్నారు. ఇప్పుడు కాళ్లు పట్టుకుంటున్న రైతులు రేపు గల్లా పట్టుకోకముందే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
- Tags
- ys sharmila
- kcr
Next Story

