Sun Dec 07 2025 23:18:27 GMT+0000 (Coordinated Universal Time)
192వ రోజుకు చేరిన షర్మిల పాదయాత్ర
వైఎస్ షర్మిల పాదయాత్ర నేడు 192వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం కోరుట్ల నియోజకవర్గంలో ప్రజాప్రస్థానం యాత్ర కొనసాగుతుంది

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్ర నేడు 192వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం కోరుట్ల నియోజకవర్గంలో ప్రజాప్రస్థానం యాత్ర కొనసాగుతుంది. ఉదయం పదిగంటలకు బాదన్కుర్తి నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర ను వైఎస్ షర్మిల మొదలు పెట్టారు. మల్లాపూర్ మండల పరిధిలో ఈరోజు యాత్ర జరగనుంది.
మాట - ముచ్చట...
ఒబులాపూర్, సంగెం, రామరాజుపల్లి, దామరాజపల్లి, మల్లాపూర్, కుస్తాపూర్, సిర్పూర్, రాఘవపేట గ్రామాల మీదుగా యాత్ర కొనసాగనుంది. సాయంత్రం నాలుగు గంటలకు కుస్థాపూర్ గ్రామ ప్రజలతో వైఎస్ షర్మిల మాట - ముచ్చట కార్యక్రమంలో పాల్గొంటారు. షర్మిల పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన లభిస్తుంది.
- Tags
- ys sharmila
Next Story

