Fri Dec 19 2025 00:31:39 GMT+0000 (Coordinated Universal Time)
నేడు వరంగల్ జిల్లాకు షర్మిల
వైఎస్ షర్మిల నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంటలను ఆమె పరిశీలించనున్నారు

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంటలను ఆమె పరిశీలించనున్నారు. నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించనునున్నారు. ఉదయం పదకొండు గంటలకు జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం ఆలింపూర్, గంగాపూర్ గ్రామంలో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు.
రేపు ఖమ్మంలో...
సాయంత్రం నాలుగు గంటలకు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యవారి పల్లె గ్రామంలో వైఎస్ షర్మిల పర్యటిస్ారు. అక్కడ రైతులతో మాట్లాడతారు. పంట నష్టం ఎంత జరిగింది తెలుసుకుంటారు. రాత్రికి ఈర్లపూడి గ్రామంలో బస చేసి, రేపు ఉదయం ఖమ్మం జిల్లాలో పర్యటించి రైతులను పరామర్శిస్తారు. పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకుంటారు.
Next Story

