Fri Mar 20 2026 18:11:20 GMT+0530 (India Standard Time)
పోలీసుల కళ్లు గప్పి... వైఎస్ షర్మిల
వైఎస్ షర్మిల ప్రగతి భవన్ వైపునకు వెళ్లారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆమె నిరసన తెలియజేసేందుకు వెళ్లారు

వైఎస్ షర్మిల ప్రగతి భవన్ వైపునకు వెళ్లారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆమె నిరసన తెలియజేసేందుకు వెళ్లారు. నిన్న వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసి హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు పోలీసులు తరలించిన సంగతి తెలిసిందే. ఆమె పాదయాత్రతో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు భావించి అరెస్ట్ చేస్తున్నారు.
ప్రగతి భవన్ వైపు...
లోటస్ పాండ్ నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. అయితే పోలీసులు కళ్లుగప్పి లోటస్ పాండ్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆమె ప్రగతి భవన్ వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు షర్మిల కోసం ప్రగతి భవన్ వైపుకు వెళ్లారు. తాను రాత్రి పూట బస చేసే బస్సు ను దగ్దం చేసిన వారిని అరెస్ట్ చేయకుండా తనను అరెస్ట్ చేయడం ఏంటని వైఎస్ షర్మిల ప్రశ్నిస్తున్నారు.
Next Story

