Fri Dec 19 2025 00:27:44 GMT+0000 (Coordinated Universal Time)
ఎంతో ఆనందపడుతున్న వైఎస్ షర్మిల
ధైర్యం, నిజాయితీ కలిగిన హృదయాలతో ముందుకెళ్లమని పిల్లలకు సూచించారు

వైఎస్ఆర్టీపీ అధినేత్రి వై.ఎస్.షర్మిల తన కుమార్తె, కుమారుడు సాధించిన ఘనతకు ఉప్పొంగిపోయారు. ఆమె ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. నా అద్భుతమైన పిల్లలిద్దరూ చదువులో మైలురాళ్లను అధిగమించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. అందులో తన ఇద్దరు పిల్లలతో షర్మిల ఉన్న ఫోటోను పోస్టు చేశారు. ఎకనామిక్స్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని సాధించినందుకు కుమారుడు రాజారెడ్డికి, బీబీఏ ఫైనాన్స్ డిగ్రీని సంపాదించినందుకు కుమార్తె అంజిలీ రెడ్డికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు వైఎస్ షర్మిల. మీరు చాలా త్వరగా ఉన్నతస్థానాలకు ఎదిగారని.. మీ ఇద్దరి గురించి చెప్పడం చాలా గర్వంగా ఉందన్నారు వైఎస్ షర్మిల. ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ధైర్యం, నిజాయితీ కలిగిన హృదయాలతో ముందుకెళ్లమని పిల్లలకు సూచించారు షర్మిల. సత్యాన్ని గ్రహించండి.. సమగ్రతతో కూడిన జీవితాన్ని స్వీకరించండి. మీరు మీ లక్ష్యాలను చేరుకునేటప్పుడు మీ చుట్టూ ఉన్నవారిని గౌరవించాలని కోరారు. ఇతరుల ఆశీర్వాదం తీసుకొని వారిపట్ల గౌరవంగా మెలగాలని సూచించారు. ఈ ట్వీట్ లో కుమార్తె అంజిలీ రెడ్డి, కొడుకు రాజారెడ్డి డిగ్రీ పట్టాలు అందుకున్న సమయంలో వారితో కలిసి ఉన్న ఫొటోలను షర్మిల ట్వీట్ చేశారు. ఈ ఫొటోల్లో షర్మిల, ఆమె భర్త అనిల్, విజయమ్మ ఉన్నారు. షర్మిల పిల్లలకు పలువురు ప్రముఖులు, అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు.
Next Story

