Fri Dec 05 2025 18:03:48 GMT+0000 (Coordinated Universal Time)
పిచ్చి ముదిరి .. రైల్వే ట్రాక్ పై కారు పోనిస్తూ.. షూట్ చేసుకుంటూ..యువతి సాహనం
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలోని రైల్వే ట్రాక్ పై ఒక యువతి కారు నడిపి సంచలనం సృష్టించింది

నేటి యువతకు రీల్స్ పిచ్చి బాగా ముదిరిపోయింది. సాహసంచేస్తే వ్యూస్ వచ్చిపడతాయని అనుకుంటున్నారో ఏమో ప్రాణాలకు తెగించి సాహసాలకు ఒడిగడుతున్నారు. ఇందులో మహిళలు, పురుషులు అన్న భేదం లేదు. అందరూ రీల్స్ పిచ్చిలో పడి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడమే తమ జీవిత ప్రాధాన్యత అని భావిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలోని రైల్వే ట్రాక్ పై ఒక యువతి కారు నడిపిన ఘటన ఇలాంటిదే. నిజంగా పెను ప్రమాదమే తప్పింది. రైల్వే సిబ్బంది చూడకపోతే యువతి ప్రాణాలు గాలిలో కలసి పోయేవి.
ఇన్ స్టా గ్రామ్ రీల్స్ కోసం...
ఇన్ స్టా గ్రామ్ రీల్స్ కోసం ఈ యువతి చేసిన పనికి రైల్వే పోలీసులు ఆశ్చర్యపోయి చివరకు అదుపులోకి తీసుకున్నారు. నిజంగా పిచ్చి. వెర్రి అనాలా? యువతి ట్రాక్ పై కారును పరుగు పెట్టిస్తుండటంతో రైళ్లన్నీ నిలిపివేశారు. రైల్వే క్రాసింగ్ గేట్ వద్ద తమ కెమెరాల్లో రైల్వే సిబ్బంది ఈ వీడియోను తీశారు.శంకర్ పల్లి రైల్వే స్లేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్ పై యువతి తన కారుతో వెళుతూ వీడియోను షూట్ చేస్తుంది. ఈ కారుకు నెంబరు ప్లేట్ కూడా లేదు. స్థఆనికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రైళ్ల రాకపోకలకు అంతరాయం...
రైల్వే పోలీసులు వెళ్లి అడ్డుకుని యువతిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సివిల్ పోలీసులకు అప్పగించారు. రీల్స్ చేయడానికే ఈ సాహసానికి యువతి ఒడిగట్టిందని పోలీసులు చెబుతున్నారు. రైల్వే ట్రాక్ పై కారు ఉండటంతో హైదరాబాద్ - బెంగళూరు మధ్య నడిచే అన్ని రైళ్లను నిలిపేయాల్సి వచ్చింది. దీంతో పాటు అనేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దూర ప్రాంతాల నుంచి తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి ఆలస్యం కావడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. యువతిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
Next Story

