Sun Mar 08 2026 02:56:20 GMT+0530 (India Standard Time)
యశ్వంత్ సిన్హా నామినేషన్ కు కేటీఆర్
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొననున్నారు.

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు విపక్ష నేతలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. ఈరోజు ఉదయం కేటీఆర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
విపక్షాల అభ్యర్థిగా...
యశ్వంత్ సిన్హా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికయిన తెలిసిందే. 22 పార్టీలు ఆయనకు మద్దతు తెలిపాయి. ఈరోజు జరిగే నామినేషన్ కార్యక్రమంలో అన్ని పార్టీల నేతలు పాల్గొంటారు. టీఆర్ఎస్ నుంచి కేటీఆర్ తో పాటు పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావుతో పాటు ఎంపీలు కూడా పాల్గొన్నారు. అనంతరం ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు.
Next Story

