Fri Dec 05 2025 18:55:59 GMT+0000 (Coordinated Universal Time)
BRS : ఫామ్‌హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్ భేటీ.. కవిత విషయంపైనే?
ఎర్రవల్లి ఫామ్‌హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు

ఎర్రవల్లి ఫామ్‌హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో సమావేశమైన కేటీఆర్ పలు విషయాలను చర్చించారు. కవిత లేఖ నేపథ్యంలో ఇద్దరి భేటీపై ఆసక్తి నెలకొంది. కాళేశ్వరం నోటీసులతో పాటు తాజా పరిస్థితులపై చర్చ జరుగుతున్నట్లు చెబుతున్నా కల్వకుంట్ల కవిత లేఖతో పాటు తర్వాత ఆమె మీడియా ఎదుట చేసిన వ్యాఖ్యల గురించి ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. అయితే కేసీఆర్ కవిత లేఖపై కాని, ఆమె చేసిన వ్యాఖ్యలపై కానీ ఎవరూ స్పందించవద్దని కేసీఆర్ అన్నట్లు తెలిసింది.
ఎవరూ మాట్లాడవద్దని...
కవిత లేఖను, ఆమె వ్యాఖ్యలపై మాట్లాడుతూ ఆ విషయాన్ని మరింతగా లాగవద్దని కూడా కేసీఆర్ బీఆర్ఎస్ నేతలకు హెచ్చరించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని తాను పరిష్కరిస్తానని కేటీఆర్ తో కేసీఆర్ అన్నట్లు సమాచారం. మొత్తం మీద కవిత లేఖ, వ్యాఖ్యల పట్ల కేసీఆర్ ఒకింత అసహనంగా ఉన్నారని తెలిసింది. కవిత తో మాట్లాడాలని ఆమెను ఫామ్ హౌస్ కు రావాలని పిలిచినా ఆమె రాలేదని చెబుతున్నారు. మరో వైపు రేపు కవిత కాళేశ్వరం బయలుదేరివెళుతున్నారు. సరస్వతి పుష్కరాల్లో ఆమె పుణ్యస్నానాలు చేయడానికి వెళుతున్నారు.
Next Story

