Sun May 19 2024 05:13:43 GMT+0000 (Coordinated Universal Time)
బీర్లతో ప్రభుత్వాస్పత్రిలో పార్టీ చేసుకున్న మహిళా సిబ్బంది
ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో మహిళా ఉద్యోగులు మద్యం సేవించి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఘటన హన్మకొండలో..
ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో మహిళా ఉద్యోగులు మద్యం సేవించి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఘటన హన్మకొండలో జరిగింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో నలుగురు మహిళా ఉద్యోగులు ఆస్పత్రిలో ఉన్న స్టాఫ్ రూమ్ లో కూర్చొని ఉండగా.. వారిలో ఒక మహిళ తన ఒడిలో బీర్ బాటిల్ పట్టుకుని కనిపించింది.
వారంరోజుల క్రితం ఓ గర్భిణీ బంధువు ఈ ఘటనను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో..వైరల్ అయి.. ఆస్పత్రి అధికారుల కంటపడింది. దాంతో అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. కాగా.. వీడియో చూసిన ఇద్దరు మహిళా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మద్యం సేవంచారన్న ఆరోపణలను ఖండించారు.
Next Story