Sun Mar 15 2026 12:08:45 GMT+0530 (India Standard Time)
కోకాపేటలో దారుణం.. సగంకాలిన మహిళ మృతదేహం లభ్యం
ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. మహిళపై అత్యాచారం చేసి, ఎక్కడో హత్య చేసి,

హైదరాబాద్ శివారు ప్రాంతమైన కోకాపేటలో దారుణం చోటుచేసుకుంది. కోకాపేటలోని సెవెన్ హిల్స్ వద్ద సగం కాలిన మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిర్మానుష్యప్రాంతంలో మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Also Read : సీనియర్ హీరోయిన్ కు ఒమిక్రాన్ పాజిటివ్ !
ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. మహిళపై అత్యాచారం చేసి, ఎక్కడో హత్య చేసి, ఇక్కడకు తీసుకొచ్చి పడేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కాగా.. హత్యకు గురైన మహిళ ఎవరు ? చంపిన దుండగులెవరు? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

