Thu Dec 18 2025 22:55:37 GMT+0000 (Coordinated Universal Time)
ఈనెల 24 నుంచి హైదరాబాద్ లో ఎయిర్ షో ప్రారంభం
నాలుగు రోజులపాటు సాగే ఈ ప్రదర్శనలో 200కు పైగా అంతర్జాతీయ సంస్థలు, ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. ఆరువేలకు పైగా ట్రేడ్ విజిటర్స్

హైదరాబాద్ లో త్వరలోనే ఎయిర్ షో ప్రారంభం కానుంది. ఈ నెల 24 నుంచి వింగ్స్ ఇండియా-2022 పేరుతో ఎయిర్ షో నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బేగంపేట ఎయిర్ పోర్టు వేదికగా జరిగే ఈ ఎయిర్ షో లో పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన అత్యాధునిక విమానాలు, జెట్లు, హెలికాఫ్టర్లు నగవాసులను కనువిందు చేయనున్నాయి. కరోనా కారణంగా నాలుగేళ్ల విరామం అనంతరం మళ్లీ ఎయిర్ షో ను నిర్వహిస్తున్నారు.
నాలుగు రోజులపాటు సాగే ఈ ప్రదర్శనలో 200కు పైగా అంతర్జాతీయ సంస్థలు, ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. ఆరువేలకు పైగా ట్రేడ్ విజిటర్స్, 50 వేల మంది సందర్శకులు పాల్గొంటారని అధికారుల అంచనా. ఈ ప్రదర్శనలను వీక్షించాలనుకునే వారు వింగ్స్ ఇండియా అధికారిక వెబ్ సైట్ లో ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించామని అధికారులు తెలిపారు. తొలి మూడురోజులు వ్యాపారవేత్తలను అనుమతిస్తారు. చివరిరోజు సాధారణ సందర్శకులు రూ.500 చెల్లించి ప్రదర్శనలను వీక్షించవచ్చు.
Next Story

