Tue Dec 23 2025 06:46:05 GMT+0000 (Coordinated Universal Time)
Murder Case : ప్రియుడితో కలిసి భర్తను లేపేసిన భార్య.. మర్డర్ స్కెచ్ మామూలుగా లేదుగా?
వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని చెప్పి భార్య భర్తను ప్రియుడితో కలసి హత్య చేయించింది

వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని చెప్పి భార్య భర్తను ప్రియుడితో కలసి హత్య చేయించింది. తర్వాత ఏమీ జరగనట్లు డ్రామాకు తెరతీసింది. ఈ ఘటన మేడివల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల విచారణలో చివరకు భార్య భర్త మర్డర్ కు ప్లాన్ చేసిందని నిర్ధారణ కావడంతో ఆ దిశగా పోలీసులు విచారిస్తుున్నారు. మేడిపల్లి లో రెండు రోజుల క్రితం అశోక్ అనే వ్యక్తి మరణించాడు. అయితే గుండెపోటుతో మరణించాడని భార్య బంధువులను నమ్మించింది. చివరకు అంత్యక్రియలను కూడా జరిపించింది. అయితే తర్వాత భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు.
ప్రియుడి సహకారంతో...
అయితే పోలీసుల కథనం ప్రకారం...అశోక్ ను హత్య చేయించింది భార్య పూర్ణిమ అని, ఆమెకు సహకరించింది ప్రియుడు మహేష్ అని పోలీసులు గుర్తించారు. పూర్ణిమ, అశోక్ కు పదకొండేళ్ల క్రితం వివాహమయింది. వీరికి పదేళ్ల కుమారుడున్నాడు. అయితే పూర్ణిమకు ఇంటి పక్కనే ఉండే మహేష్ అనే యువకుడితో పరిచయం శారీరక సంబంధానికి దారి తీసింది. అయితే ఇద్దరి మధ్య వివాహేతర సంబంధాన్ని గురించి తెలుసుకున్న అశోక్ భార్యను మందలించాడు. ప్రవర్తన మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించాడు. దీంతో భర్త అశోక్ ను లేపేయడానికి భార్య పూర్ణిమ స్కెచ్ వేసింది. అశోక్ పై పూర్ణిమ, మహేష్ లు దాడి చేసి చున్నీతో మెడకు బిగించి హత్య చేశారు.
సోదరికి ఫోన్ చేసి...
అయితే తర్వాత అశోక్ సోదరికి ఫోన్ చేసిన పూర్ణిమ గుండెపోటుతో స్పృహలేకుండా పడిపోయాడని చెప్పింది. ఒంటిమీద గాయాలుండటంతో బాత్ రూమ్ లో పడ్డాడని నమ్మించింది. పోస్టుమార్టం చేయకుండా పూర్ణిమ, మహేష్ లు చివర వరకూ ప్రయత్నించార. అందుకు కుటుంబ సభ్యులను కూడా ఇంప్పించగలిగారు. కానీ పోలీసులు పోస్టుమార్టం చేయడంతో అది హత్య అని తేలింది. పోలీసులు తమ దైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. దీనికి తోడు అశోక్ మృతిచెందిన తర్వాత పెద్దగా బాధపడకపోవడం కూడా బంధువులకు అనుమానాలు కలిగించింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేసి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story

