Sat Mar 07 2026 16:18:00 GMT+0530 (India Standard Time)
రాష్ట్రంలో ఇవాళ, రేపు వర్షాలు
ఎండలు మండిపోతున్న తరుణంలో వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో ఈరోజు రేపు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది

ఎండలు మండిపోతున్న తరుణంలో వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో ఈరోజు రేపు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని తెలిపింది.
అల్పపీడన ద్రోణి....
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల తేలిక పాటి, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. దాదాపు ప్రతి రోజు నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో చిరు జల్లులు కురియడం కూడా చల్లటి కబురు అనుకోవాలి.
Next Story

