Thu Jan 22 2026 00:37:15 GMT+0000 (Coordinated Universal Time)
మద్యం లారీ బోల్తా... మందుబాటిల్స్ కోసం ఎగబడిన జనం
మద్యం సరుకుతో వెళుతున్న లారీ బోల్తా పడటంతో వాటిని చేజిక్కించుకునేందుకు జనం ఎగబడ్డారు

మద్యం సరుకుతో వెళుతున్న లారీ బోల్తా పడటంతో వాటిని చేజిక్కించుకునేందుకు జనం ఎగబడ్డారు. సికింద్రాబాద్లోని బోయిన్ పల్లి ప్రాంతంలో లిక్కర్ లారీ బోల్తా పడింది. ఆ లారీ నుంచి కేస్ల కొద్దీ లిక్కర్ సీసాలు రోడ్డుపై పడిపోయాయి. ఇక జనం అవి తీసుకొని పరుగుతీశారు.లారీ టైర్ పంక్చర్ కావడం వల్ల డివైడర్ను ఢీకొట్టి లారీ బోల్తా పడింది.
మూదు లక్షల విలువైన...
దీని వల్ల దాదాపు రూ. 3 లక్షల విలువైన మద్యం సీసాలు ధ్వంసం అయ్యాయని సమాచారం. రోడ్డుపై జనం ఎగబడడంతో అక్కడ ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై ప్రయాణించాల్సిన మిగతావారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చేసేందుకు శ్రమించారు.
Next Story

