Mon Mar 16 2026 17:04:53 GMT+0530 (India Standard Time)
Telangana : రేపటి నుంచి తెలంగాణలో వర్షాలేనట
రేపటి నుంచి తెలంగాణలో వాతావరణం చల్లబడనుంది. వర్షాలు కురిసే అవకాశముంది.

రేపటి నుంచి వాతావరణం చల్లబడనుంది. వర్షాలు కురిసే అవకాశముంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఆదివారం నుంచి తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మూడు రోజుల పాటు తేలికపాటితో వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చె్పింది.
ఈదురుగాలులు కూడా...
ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని కూడా తెలిపింది. ఆదివారం ఆదిలాబాద్, కుమరం భీం, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఎండలు విపరీతంగా కాస్తున్న వేళ తెలంగాణ వాసులకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మరో రెండు రోజులు పాటు కూడా వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని చెప్పింది.
Next Story

