Wed Jan 21 2026 04:53:42 GMT+0000 (Coordinated Universal Time)
చల్లబడిన భాగ్యనగరం..పలు ప్రాంతాల్లో భారీ వర్షం
గురువారం సాయంత్రం నగరమంతా ఒక్కసారిగా చల్లబడింది. చల్లటి గాలులతో ఆహ్లాద వాతావరణం..

హైదరాబాద్ : నెలరోజులుగా మండుటెండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న భాగ్యనగర వాసులకు మండే ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించింది. గురువారం సాయంత్రం నగరమంతా ఒక్కసారిగా చల్లబడింది. చల్లటి గాలులతో ఆహ్లాద వాతావరణం నెలకొంది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
నగరంలోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఎస్ఆర్ నగర్లలో భారీ వర్షం కురవగా.. హయత్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్, వనస్థలిపురంలలో ఓ మోస్తరు వర్షం కురిసింది. మిగతా ప్రాంతాల్లో వర్షం లేకపోయినా ఈదురుగాలులు వీచాయి. ఈదురుగాలులు, వర్షంతో నగరవాసులు కాస్త ఉపశమనం పొందారు.
Next Story

