Fri Dec 05 2025 09:22:46 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణకు మళ్లీ పొంచి ఉన్న వర్షం ముప్పు
హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకారం, 2023 ఆగస్టు 18, 19 తేదీలలో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో

హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకారం, 2023 ఆగస్టు 18, 19 తేదీలలో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. శుక్ర, శనివారాల్లో వాతావరణ శాఖ రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్డిపిఎస్) రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని అంచనా వేసింది. హైదరాబాద్ లో రాబోయే మూడు రోజుల పాటు నగరంలో తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.
ప్రస్తుత రుతుపవనాల సీజన్లో తెలంగాణలో అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సాధారణంగా 466.9 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 582.4 మి.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో ప్రస్తుత వర్షాకాలంలో 450.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎల్నినో సంవత్సరం అయినప్పటికీ తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా అధిక వర్షపాతం నమోదైంది. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో ఈ నెల 18, 19 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
Next Story

