Sat Mar 07 2026 14:42:50 GMT+0530 (India Standard Time)
Telangana : తెలంగాణ వాసులకు శుభవార్త
వాతావరణ శాఖ తెలంగాణ వాసులకు శుభవార్త చెప్పింది. ఈరోజు, రేపు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది

Weather Update:వాతావరణ శాఖ తెలంగాణ వాసులకు శుభవార్త చెప్పింది. ఈరోజు, రేపు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశముందని వాతవరణ శాఖ తెలిపింది. శని, ఆదివారాలు వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
కొద్ది రోజులుగా...
నిజంగా ఇది చల్లటి కబురు. గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. కొన్ని చోట్ల 35 డిగ్రీల వరకూ నమోదవుతుండటంతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. ఉక్కపోతతో అల్లాడి పోతున్నారు. ఈ సమయంలో చిరుజల్లులు కురిస్తే కొంత వరకూ వాతావరణం చల్లబడితే సేదతీరినట్లేనని భావించాలి.
Next Story

