Sat Mar 07 2026 21:54:17 GMT+0530 (India Standard Time)
Weather Update: ఈరోజు కూడా వర్షాలే.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
హైదరాబాద్‌లో వరుసగా ఏడవ రోజు కూడా మేఘావృతమై ఉంది

హైదరాబాద్‌లో వరుసగా ఏడవ రోజు కూడా మేఘావృతమై ఉంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. అంతేకాకుండా హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
జగిత్యాల, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, నల్గొండ, నారాయణపేట, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేటకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ విభాగం. గత 24 గంటల్లో లంగర్ హౌస్‌లో 9 మిమీ, హైదర్‌నగర్‌లో 8.8 మిమీ, యూసుఫ్‌గూడలో 8.5 మిమీ, గచ్చిబౌలిలో 8.5 మిమీ, హైదరాబాద్ యూనివర్సిటీలో 8.3 మిమీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.
Next Story

