Fri Dec 05 2025 13:36:43 GMT+0000 (Coordinated Universal Time)
డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ ను తీసుకొచ్చాం: సీఎం రేవంత్
తెలంగాణలో డ్రగ్స్ కట్టడి కోసం ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్స్ లా ఎన్ఫోర్స్మెంట్ ను ఏర్పాటు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు

తెలంగాణలో డ్రగ్స్ కట్టడి కోసం ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్స్ లా ఎన్ఫోర్స్మెంట్ ను ఏర్పాటు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ బృందాన్ని ఈగల్ టీమ్ అంటారు. ఈ టీమ్ డ్రోన్ల ద్వారా గంజాయి సాగును గుర్తించడంతోపాటు, రాష్ట్రంలోని 1.5 కోట్ల ఎకరాల వ్యవసాయ భూముల్లో ఎక్కడ గంజాయి మొక్క మొలిచినా కనిపెడుతుందని తెలిపారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, యువత భవిష్యత్తును కాపాడాలని సీఎం పిలుపునిచ్చారు. డ్రగ్స్ నిర్మూలన ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ఇందులో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్ర సరిహద్దుల గుండా డ్రగ్స్ రాకుండా చూస్తామని, అవసరమైతే సరిహద్దులు దాటి వెళ్లి డ్రగ్స్ స్మగ్లర్ల వెన్ను విరుస్తామని హెచ్చరించారు.
Next Story

