Thu Mar 19 2026 09:11:46 GMT+0530 (India Standard Time)
ఉద్యోగం విడిచి వెళ్లిపోతా : సీపీ రంగనాథ్
తాను సెటిల్్మెంట్ లు చేసినట్లు నిరూపిస్తూ ఉద్యోగం వదిలేసి వెళ్లిపోతానని వరంగల్ పోలీసు కమిషనర్ రంగనాధ్ అన్నారు

తాను సెటిల్్మెంట్ లు చేసినట్లు నిరూపిస్తూ ఉద్యోగం వదిలేసి వెళ్లిపోతానని వరంగల్ పోలీసు కమిషనర్ రంగనాధ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. తనకు అక్రమాస్థులు ఉన్నాయని నిరూపించాలని ఆయన సంజయ్ కు సవాల్ విసిరారు.
బండి సంజయ్ కు....
అనేక కేసుల్లో తాను కఠిన చర్యలు తీసుకుంటే కొందరికి బాధ కలిగి ఉండవచ్చని రంగనాధ్ అభిప్రాయపడ్డారు. వాళ్లు ఎప్పుడూ పోలీసులపై ఆరోపణలు చేస్తేుంటారని పరోక్షంగా బీజేపీ నేత బండి సంజయ్ ఉద్దేశించి అన్నారు. తాను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగానే పనిచేస్తున్నానని, అందుకోసమే నేడు కూడా తన వద్దకు సమస్యలను పరిష్కరించాలని పేద ప్రజలు నేరుగా వస్తారని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు.
Next Story

