Sun Apr 27 2025 10:37:08 GMT+0000 (Coordinated Universal Time)
సంజయ్ నేరాన్ని అంగీకరించాడు : రంగనాధ్
బండి సంజయ్ పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో తన నేరాన్ని అంగీకరించారని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు

బండి సంజయ్ పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో తన నేరాన్ని అంగీకరించారని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పదో తరగతి ప్రశ్నాపత్రాన్ని ప్రశాంత్ అనే యువకుడు వైరల్ చేశారన్నారు. ప్రశాంత్, మహేష్‌లు కలసి బండి సంజయ్‌కు ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్‌లో పంపారని తెలిపారు. ఉదయం 11.24 గంటలకు బండిం సంజయ్‌కు ప్రశ్నాపత్రం చేరిందని రంగనాథ్ తెలిపారు. ఉదయం 9.30 గంటలకే ప్రశ్నాపత్రం లీకయినట్లు ప్రశాంత్ అసత్య ప్రచారం చేశారని తెలిపారు. అరెస్ట్ సమయంలో సెల్‌ఫోన్ తనవద్ద లేదని చెప్పాడని, బీజేపీలో చాలా మందికి ఈ ప్రశ్నాపత్రాన్ని తాను షేర్ చేసినట్లు బండి సంజయ్ అంగీకరించినట్లు పోలీసు కమిషన్ తెలిపారు.
స్పీకర్ చెప్పిన తర్వాతనే...
ప్రశ్నాపత్రాన్ని లీకు చేసే ముందు బండిం సంజయ్, ప్రశాంత్‌ల మధ్య ఛాట్ చేసుకున్నారని, 149 మందిని ఈ ప్రశ్నాపత్రాన్ని బండి సంజయ్ షేర్ చేశారన్నారు. కమలాపూర్ పాఠశాల నుంచి ఈ ప్రశ్నాపత్రం బయటకు వచ్చిందని రంగనాధ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. బండి సంజయ్ అరెస్ట్‌పై లోక్‌సభ స్పీకర్ కు సమాచారం ఇచ్చామన్న సీపీ రంగనాధ్ ఈ కేసులో ఏ1గా బండి సంజయ్‌ను నిందితుడిగా చేర్చామని తెలిపారు. ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినే విధంగా కుట్ర జరిగిందని తమ విచారణలో కనుగొన్నామని ఆయన చెప్పారు. లీకేజీకి పాల్పడటమే కాకుండా అందుకు బాధ్యత ప్రభుత్వం వహించాల్సి ఉంటుందని విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని కూడా రంగనాథ్ పేర్కొన్నారు.
Next Story