Fri Mar 27 2026 18:25:07 GMT+0530 (India Standard Time)
బీజేపీలో చేరిన విఠల్
భారతీయ జనతా పార్టీలో టీఎస్ పీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్ చేరారు. తరుణ్ చుగ్, బండి సంజయ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.

భారతీయ జనతా పార్టీలో టీఎస్ పీఎస్సీ సభ్యుడు వఠల్ చేరారు. తరుణ్ చుగ్, బండి సంజయ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. మాజీ ఉద్యోగ సంఘాల నేత విఠల్ పార్టీలో చేరడం చర్చనీయాంశమైంది. ఆయన ఢిల్లీలో పార్టీ పెద్దల సమక్షంలో చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విఠల్ ఉద్యోగ సంఘాల నేతగా అందరికీ సుపరిచితమే.
రాజకీయ ఎదుగుదల కోసం...
ఆయన టీఆర్ఎస్ లో ఉన్నారు. కేసీఆర్ టీఎస్ పీఎస్సీ సభ్యుడిగా నియమించారు. అయితే తన రాజకీయ ఎదుగుదల బీజేపీలోనే సాధ్యమవుతుందని భావించిన విఠల్ ఈరోజు బీజేపీలో చేరారు. ఢిల్లీ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయనకు పార్టీ నేతలు కండువా కప్పి ఆహ్వానించారు.
Next Story

