Sat Mar 14 2026 08:59:47 GMT+0530 (India Standard Time)
నేడు జగిత్యాల బంద్
ఈరోజు జగిత్యాల పట్టణంలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్‌లు బంద్‌కు పిలుపునిచ్చాయి

ఈరోజు జగిత్యాల పట్టణంలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్‌లు బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విశ్వహిందూ పరిషత్, భజరంగదళ్ లు బంద్ కు పిలుపు నివ్వడంతో ముందు జాగ్రత్త చర్యగా వ్యాపారసంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు.
వీహెచ్‌పీ, దళ్...
ఎస్సై అనిల్‌కు మద్దతుగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ లు జగిత్యాల పట్టణం బంద్‌కు పిలుపునిచ్చాయి. ఎస్ఐ అనిల్ పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల పట్టణ బంద్‌కు పిలుపునివ్వడంతో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్టీసీ బస్సులను కూడా రానివ్వకుండా ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు.
Next Story

