Mon Feb 10 2025 10:40:13 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : దావోస్.. దంచి కొట్టిన రేవంత్ సర్కార్.. పెట్టుబడుల వరద
దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటన పూర్తిగా విజయవంతమయింది

దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటన పూర్తిగా విజయవంతమయింది. గత ఏడాది కంటే మూడు రెట్లు అదనంగా పెట్టుబడులను సాధించింది. తాము ఊహించిన దానికన్నా ఎక్కువ పెట్టుబడులను రాష్ట్రానిని తేవడంలో రేవంత్ రెడ్డి టీం సక్సెస్ అయిందనే చెప్పాలి. దావోస్ లో కుదిరిన ఒప్పందాల విలు 1,78,950 కోట్ల రూపాయలు. దీనివల్ల 49,500 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అధికారులు తెలిపారు. ఇంత పెద్ద స్థాయిలో ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వ హయాంలోనూ పెట్టుబడులు రాలేదు. ఇందుకు అనేక కారణాలున్నాయంటున్నారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు కావాల్సిన అనుకూల వాతావరణం ఉండటమే.
కారణాలివే...
ముఖ్యంగా హైదరాబాద్ నగరం వరంగా మారిందనే చెప్పాలి. హైదరాబాద్ నగరం అన్ని రకాలుగా అనుకూలమైనది కావడంతో పాటు రాజకీయ పార్టీలు కూడా హైదరాబాద్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం కూడా ఒక కారణంగా చూడాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత పెద్దస్థాయిలో పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి కావడంతో కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయంగా కూడా ఇది తాము పై చేయి సాధించినట్లేనని అంచనాకు వచ్చాయి. గతంలో కేటీఆర్ వల్లనే పెట్టుబడులు వచ్చాయన్న ముద్రను రేవంత్ రెడ్డి టీం చెరపగలిగింది. కేవలం మంత్రుల వల్ల కాదని, ఇక్కడి ప్రభుత్వంతో పాటు వాతావరణ పరిస్థితుల సానుకూలత అంశం కూడా పెట్టుబడులు రావడానికి పనిచేస్తాయని రుజువు చేసిందనే చెప్పాలి.
పదహారు కంపెనీలతో...
దావోస్ పర్యటనకు ముందు నుంచే రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండటంతో దీనిని సవాల్ గా తీసుకున్నారు. సింగపూర్ వెళ్లి అక్కడ 3,500 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకున్నారు. అనంతరం దావోస్ వెళ్లి దుమ్మురేపారు. ప్రతిష్టాత్మక సంస్థల ప్రతినిధులతో నేరుగా మాట్లాడి ఒప్పందాలను కుదుర్చుకున్నారు. మొత్తం 16కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకుంది. అవసరమైన స్థలం ఇవ్వడంతో పాటు రాయితీలను ప్రకటించి ఇతర రాష్ట్రాలను వెనక్కు నెట్టడంలో రేవంత్ రెడ్డి బృందం సక్సెస్ అయింది. ముఖ్యమైన సంస్థలతో నేరుగా ఒప్పందాలు కుదుర్చుకుని, అనుభవం కాదు గురూ.. వారి అవసరాలను గుర్తించి తేవడమే ముఖ్యమని రేవంత్ రెడ్డి బృందం నిరూపించగలిగింది. అతిపెద్ద సక్సెస్ తో రాష్ట్రానికి వస్తున్న రేవంత్ రెడ్డి బృందానికి స్వాగతం పలికేందుకు పెద్దయెత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Next Story