Tue Dec 09 2025 04:57:20 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు విజన్ డాక్యుమెంట్ విడుదల
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో నేడు విజన్ డాక్యుమెంట్ 2047 ను విడుదల చేయనున్నారు.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో నేడు విజన్ డాక్యుమెంట్ 2047 ను విడుదల చేయనున్నారు. నిన్న ఫ్యూచర్ సిటీలో ప్రారంభమయిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు 44 దేశాల నుంచి ప్రతినిధులు సమ్మిట్ కు హాజరయ్యారు. తొలిరోజు పన్నెండు అంశాలపై వివిధ రంగాల నిపుణులతో చర్చలు జరిగాయి. అవగాహన ఒప్పందాలు కూడా కుదిరాయి.
భవిష్యత్ ప్రణాళికను...
ఈరోజు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047 ను ప్రభుత్వం విడుదల చేయనుంది. తమ ప్రణాళికను సదస్సు ముందు ప్రభుత్వం ఉంచనుంది. రానున్న కాలంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకునే చర్యలు, అభివృద్ధి కోసం తీసుకునే ఈ నిర్ణయాలు, వేగంగా జరగాల్సిన అభివృద్ధి కోసం తమ వద్ద ఉన్న ప్రణాళికను నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు.
Next Story

