Tue Aug 09 2022 23:51:55 GMT+0000 (Coordinated Universal Time)
వారం క్రితమే పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు మృతి

నల్గొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వారంరోజుల క్రితమే పెళ్లి చేసుకున్న ఎస్సై రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతనితో పాటు తండ్రి కూడా మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రంగారెడ్డి జిల్లా మాన్య తండాకు చెందిన శ్రీను నాయక్ వికారాబాద్ వన్ టౌన్ ఎస్సై గా విధులు నిర్వహిస్తున్నాడు. 2021, డిసెంబర్ 26వతేదీన శ్రీను నాయక్ కు వివాహమయింది.
ఆర్టీసీ బస్సు - ఆటో ఢీ
తన స్వగ్రామంలో ఒడిబియ్యం కార్యక్రమాన్ని ముగించుకుని, తండ్రితో కలిసి ఆటోలో హైదరాబాద్ కు తిరుగుపయనమయ్యాడు. ఈ క్రమంలో చింతపల్లి మండలం మాల్ దగ్గర దేవరకొండ డిపో ఆర్టీసీ బస్సు.. ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీను నాయక్ తో పాటు అతని తండ్రి మాన్య నాయక్ కూడా మృతి చెందాడు. తండ్రి, కొడుకుల ఆకస్మిక మరణంతో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story