Sun Mar 08 2026 00:56:43 GMT+0530 (India Standard Time)
టోల్ ప్లాజాల వద్ద రద్దీ
విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి రద్దీగా మారింది. ఈరోజు ఉదయం నుంచి వాహనాల రాకపోకలు ఎక్కువయ్యాయి

విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి రద్దీగా మారింది. ఈరోజు ఉదయం నుంచి వాహనాల రాకపోకలు ఎక్కువయ్యాయి. సంక్రాంతి సెలవులు ముగియడంతో సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి ప్రయాణమయ్యారు. దీంతో వేలాది వాహనాలు ఉదయం నుంచే జాతీయ రహదారిపైకి వచ్చాయి.
ట్రాఫిక్ సమస్యలు.....
దీంతో టోల్‌ప్లాజాల వద్ద రద్దీ పెరిగింది. టోల్‌ప్లాజాల నిర్వాహకులు హైదరాబాద్ వైపు వచ్చే మార్గాలు ఎక్కువగా తెరిచినా రద్దీ ఎక్కువగా ఉండటంతో టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచపోయాయి. పోలీసులు, టోల్ సిబ్బంది కలిసి ట్రాఫిక్ ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.
Next Story

