Sun Mar 15 2026 08:57:56 GMT+0530 (India Standard Time)
Kalvakuntla Kavitha : కవిత బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పు వెలువడనుంది

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పు వెలువడనుంది. హైకోర్టు ఈ తీర్పు చెప్పనుంది. ట్రయల్ కోర్టు తనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో కవిత తరుపున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కవిత బెయిల్ పిటీషన్ పై మే28న విచారణ పూర్తయింది. తీర్పును రిజర్వ్ చేసింది. నేడు తీర్పు వెలువరించనుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత మూడున్నర నెలల నుంచి తీహార్ జైలులో ఉన్నారు. ఈ ఏడాది మార్చి 15వ తేదీన కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమె ప్రమేయం ఉందని సీబీఐ, ఈడీ తరుపున న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈరోజు హైకోర్టులో వెలువడనున్న తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
Next Story

