Sun Mar 08 2026 00:55:26 GMT+0530 (India Standard Time)
దసరా రద్దీ.. విజయవాడ హైవే కిటకిట
విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది

దసరా సెలవుల కోసం సొంత గ్రామాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువయింది. ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరి తమ గ్రామాలకు బయలుదేరి వెళుతున్నారు. ఎక్కువ మంది ప్రయివేటు వాహనాలు, సొంత వాహనాల ద్వారా వెళుతుండటంతో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది.
టోల్‌ప్లాజాల వద్ద...
టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరి ఉన్నాయి. ఫాస్టాగ్ ఉన్న వాహనాలు కూడా టోల్గేట్ దాటేందుకు కొంత సమయం పడుతుంది. దీంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. నెమ్మదిగా కదులుతున్నాయి. విజయవాడ వైపు వెళ్లే గేట్లు అధిక సంఖ్యలో తెరిచినా రద్దీ మాత్రం ఎక్కువగానే కనిపిస్తుంది.
Next Story

