Fri Dec 05 2025 22:46:21 GMT+0000 (Coordinated Universal Time)
Vande Bharat Train:పిట్ట ఎగిరిపోయింది.. వందేభారత్ రైలు అద్దం పగిలింది
వందేభారత్ రైలు అద్దం పగులకట్టిన సంఘటన జనగామలో జరిగింది. జనగామకు చెందిన హరిబాబు వందేభారత్ రైలు అద్దం పగులకొట్టాడు

వందేభారత్ రైలు అద్దం పగలకట్టిన సంఘటన జనగామలో జరిగింది. జనగామకు చెందిన హరిబాబు వందేభారత్ రైలు అద్దం పగల కొట్టడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తాను వందేభారత్ రైలును కావాలని కొట్టలేదని, తనను వదిలిపెట్టాలంటూ హరిబాబు పోలీసులను వేడుకుంటున్నాడు.
జనగామకు చెందిన....
జనగామకు చెందిన హరిబాబు క్యాట్ బాల్ తో పిట్టలను కొట్టి తింటుంటాడు. అది హరిబాబుకు అలవాటు. అలవాటు ప్రకారం జనగామ సమీపంలో పిట్టలను కొట్టేందుకు ప్రయత్నించాడు. పిట్ట ఎగిరిపోయింది. రాయి వందేభారత్ రైలుకు తగిలి అద్దం పగిలింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు వస్తున్న వందేభారత్ రైలు అద్దం పగలకొట్టడంతో హరిబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story

