Fri Dec 05 2025 14:36:41 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ వందేభారత్ పై రాళ్ల దాడి
వందేభారత్ రైలుపై ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్లదాడిలో రైలు అద్దాలు ధ్వంసమయ్యాయి

వందేభారత్ రైళ్లపై వరస దాడులు జరుగుతున్నాయి. విశాఖపట్నం సమీపంలో ఘటన మరవకముందే ఖమ్మ రైల్వే స్టేషన్ లో మరో ఘటన జరిగింది. వందేభారత్ రైలుపై ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్లదాడిలో రైలు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో రైలు విశాఖపట్నానికి మూడు గంటలు ఆలస్యంగా చేరుకుంది. విశాఖలో గ్లాస్ ను మార్చామని అధికారులు తెలిపారు.
నిందితుల కోసం...
అయితే సీసీ టీవీ పుటేజీని చూసి నిందితులు ఎవరో గుర్తించే పనిలో రైల్వే పోలీసులు ఉన్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు బయలుదేరి వెళ్లాయి. తరచూ వందేభారత్ పై రాళ్లదాడులు జరుగుతుండటంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఘటనలో రాళ్లదాడి ఆకతాయిల పనిగా పోలీసులు గుర్తించారు. ఖమ్మంలో కూడా ఆకతాయిల పనేనని పోలీసులు భావిస్తున్నారు.
Next Story

