Thu Mar 20 2025 02:19:49 GMT+0000 (Coordinated Universal Time)
వందేభారత్ రైలు ఈరోజు ఆలస్యం
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వందేభారత్ రైలు వేళను మార్చారు. రైలు పై దుండగుల రాళ్ళ దాడి చేయడంతో రీ షెడ్యూల్ చేశారు.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వందేభారత్ రైలు వేళను అధికారులు మార్చారు. వందేభారత్ రైలు పై దుండగుల రాళ్ళ దాడి చేయడంతో రీ షెడ్యూల్ చేశారు. ఈ కారణంగా ఈరోజు బయలుదేరాల్సిన వందేభారత్ రైలు రీ షెడ్యూల్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
నాలుగు గంటల లేట్...
ఉదయం 5.45గంటలకు బయలుదేరవలసిన రైలు ఉదయం 9.45 గంటలకు బయలుదేరుతుందని అధికారుల తెలిపారు. వందేభారత్ రైలుపై తరచూ దాడులు చేస్తుండటంతో దక్షిణ మధ్యరైల్వే శాఖ సీరియస్ గా తీసుకుంది. కావాలని కొందరు దుండగులు చేస్తున్న ప్రయత్నాలుగా దీనిని భావిస్తున్నారు. దీని వెనుక జరగుతున్న కుట్రను బయట పెడతామని రైల్వే పోలీసులు చెబుతున్నారు.
Next Story