Sun Mar 15 2026 16:36:53 GMT+0530 (India Standard Time)
ఈ నెల23న తెలంగాణకు అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 23వ తేదీన తెలంగాణకు రానున్నారు. చేవెళ్లలో జరగనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 23వ తేదీన తెలంగాణకు రానున్నారు. చేవెళ్లలో జరగనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు బహిరంగ సభ విజయవంతం అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అమిత్ షా తెలంగాణకు వస్తుండటంతో నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశముందని చెబుతున్నారు.
చేరికలు...
అమిత్ షా పాల్గొనే బహిరంగ సభలో చేరికలు కూడా ఉంటాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. కీలక నేతలే బీజేపీలో చేరతారని వారంటున్నారు. కర్ణాటకలో ప్రచారాన్ని ముగించుకుని నేరుగా హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి చేవెళ్లకు అమిత్ షా వెళతారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ మేరకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు.
Next Story

