Thu Mar 19 2026 05:27:08 GMT+0530 (India Standard Time)
కిషన్ రెడ్డి హెల్త్ బులిటెన్
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.

కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఛాతీ నొప్పితో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గ్యాస్ ట్రబుల్తోనే ఆయనకు ఛాతీ నొప్పి వచ్చిందని ఎయిమ్స్ వైద్యులు నిర్ధారించారు. చికిత్స కొనసాగుతుందని వైద్యులు తెలిపారు.
ఈరోజు డిశ్చార్జ్ చేసే...
నిజానికి నిన్ననే కిషన్ రెడ్డిని ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి చేయాల్సి ఉందని, అయితే మరో రోజు అబ్బర్వేషన్లో ఉంచాలని నిర్ణయించామని వైద్యులు తెలిపారు. పొత్తి కడుపులో నొప్పి రావడంతోనే ఆయనను ఆసుపత్రికి తీసుకువచ్చారన్నారు. ఈరోజు కిషన్ రెడ్డిని ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశముంది.
Next Story

