Fri Dec 05 2025 19:45:12 GMT+0000 (Coordinated Universal Time)
Kishan Reddy : దెందూ.. దొందే.. తేడా ఏముంది?
కాంగ్రెస్ పాలనకు, బీఆర్ఎస్ కు తేడా లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ పాలనకు, బీఆర్ఎస్ కు తేడా లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. గుజరాత్ కు గులామ్ ను కానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారని, కానీ ఇటలీకి గులాం అని కిషన్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తరహాలోనే ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ ను నడుపుతుందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారంటీలు ఏమయిపోయాయని ఆయన ప్రశ్నించారు.
రెండింటినీ తిరస్కరించి...
అందుకే ఈ రెండు పార్టీలను తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. హామీలు ఇచ్చిఅధికారంలోకి రావడం, తర్వాత వాటిని అమలు చేయకుండా తుంగలో తొక్కడం రెండు పార్టీలకు అలవాటుగా మారిందన్నారు. రెండు పార్టీలూ ఒకరినొకరు సహకరించుకుంటూ అసలు విషయాలను పక్కదోవపట్టిస్తున్నాయన్న కిషన్ రెడ్డి ప్రజలు దీనిని గమనించి ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని కోరారు. ఏ ఎన్నిక జరిగినా ఇక తెలంగాణలో బీజేపీదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Next Story

