Fri Dec 05 2025 13:34:54 GMT+0000 (Coordinated Universal Time)
బ్రిటీష్ వారసత్వం ఉన్న పార్టీ కాంగ్రెస్ : కిషన్ రెడ్డి
కాంగ్రెస్ దిగజారి ప్రకటనలు చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు

కాంగ్రెస్ దిగజారి ప్రకటనలు చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ బ్రిటీష్ వారసత్వాన్ని కొనసాగిస్తోందన్నారు. ఇటలీకి చెందిన సోనియాను భారత ప్రధాని చేయాలని చూశారన్న కిషన్ రెడ్డి సోనియా ప్రధాని కాకుండా బీజేపీ పోరాడిందని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల వ్యవస్థను కాంగ్రెస్ నిర్వీర్యం చేసిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే బీజేపీ మరోసారి గెలవాలన్నారు.
మూడో సారి
మోదీ మూడో సారి ప్రధానమంత్రి కావడం ఖాయమని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాలలో గెలుస్తుందన్నారు. కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయిందన్నారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం పోయిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు తెలంగాణలో నూకలు చెల్లాయని, బీజేపీదే గెలుపు అని కిషన్ రెడ్డి అన్నారు.
Next Story

