Thu Mar 19 2026 11:00:58 GMT+0530 (India Standard Time)
బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే?
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తమకు అందుకు సంబంధించిన ఎలాంటి సమాచారం లేదని ఆయన తెలిపారు.

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తమకు అందుకు సంబంధించిన ఎలాంటి సమాచారం లేదని ఆయన తెలిపారు. తన తల్లి పేరుతో మొక్క నాటిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ప్రజలు అమ్మ పేరుతో చెట్టు నాటాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారన్నారు.
అమ్మకు మించిన...
దేశంలో పర్యావరణ మార్పుల వల్ల సమతుల్యం దెబ్బతినిందన్నారు. దేశంలో అడవులు తగ్గిపోతున్నాయని, పట్టణ ప్రాంతాలు కాంక్రీట్ జంగల్ గా మారిపోతున్నాయని చెప్పారు. అమ్మకు మించింది లేదని ఆయన అన్నారు. దేశాన్ని భారత మాతతో పిలుస్తామని, భూమిని భూమాత అని పిలుస్తామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. పార్టీ అధ్యక్షుడిగా కొత్త వారు వస్తారని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Next Story

