Sun Mar 08 2026 12:11:27 GMT+0530 (India Standard Time)
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి అస్వస్థత
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు చాతి నొప్పి రావడంతోఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు చాతి నొప్పి రావడంతో వెంటనే కిషన్‌రెడ్డిని ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. ఆయన ప్రస్తుతం ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఎయిమ్స్‌లోని వైద్యుల బృందం కిషన్‌రెడ్డికి చికిత్స అందిస్తుంది. గ్యాస్ ట్రబుల్తోన ఆయన ఆసుపత్రిలో చేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఎయిమ్స్‌లో చికిత్స...
ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. ఆదివారం కూడా కిషన్ రెడ్డి పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మోదీ నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను కూడా సందర్శించారు. అనంతరం ఆయన అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story

