Mon Mar 16 2026 03:55:59 GMT+0530 (India Standard Time)
డీజీపీకి కిషన్ రెడ్డి ఫోన్
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ డీజీపీకి ఫోన్ చేశారు. పోలీసుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ డీజీపీకి ఫోన్ చేశారు. పోలీసుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసంతృప్తి వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కిషన్ రెడ్డి డీజీపీ దృష్టికి తెచ్చారు. నిర్భంధం, నియంతృత్వంల మధ్య పాలన సాగుతుందని కిషన్ రెడ్డి ఫైర్ అయినట్లు తెలిసింది.
శాంతిభద్రతలకు....
బండి సంజయ్ అరెస్ట్ దగ్గర నుంచి జేపీ నడ్డాను ఎయిర్ పోర్టులో అడ్డుకోవడం వరకూ కిషన్ రెడ్డి డీజీపీతో ప్రస్తావించినట్లు తెలిసింది. ప్రజాస్వామ్య బద్ధంగా పోలీసులు వ్యవహరించాలని ఈ సందర్భంగా డీజీపీని కిషన్ రెడ్డి కోరినట్లు సమాచారం. శాంతి భద్రతలకు విఘాతం కల్గించేలా పోలీసు చర్యలు ఉన్నాయని ఆయన అన్నట్లు తెలిసింది.
- Tags
- kishan reddy
- dgp
Next Story

