Sun Mar 22 2026 02:13:34 GMT+0530 (India Standard Time)
నేడు హైదరాబాద్ కు కిషన్ రెడ్డి
నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ కు రానున్నారు

నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ కు రానున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఈరోజు ఉదయం పదకొండు గంటలకు మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ మీడియా సమావేశం జరగనుంది. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులపై వివరించనున్నారు.
ఎయిమ్స్ క్యాంపస్ కు వెళ్లి...
అనంతరం పార్టీ నేతలతోనూ కిషన్ రెడ్డి భేటీ కానున్నారు. మున్సిపల్ ఎన్నికలపై చర్చించనున్నారు. ప్రచారంతో పాటు గెలుపు దిశగా ఎన్నికల వ్యూహాలను అమలు చేయడంపై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు ఎయిమ్స్ బీబీనగర్ క్యాంపస్ కు వెళ్లి అక్కడ పనుల పురోగతిని పరిశీలించనున్నారు.
Next Story

